: కాంగ్రెస్ కు డీఎస్ రాజీనామా... సోనియాకు 3 పేజీల లేఖ!


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి మూడు పేజీల సుదీర్ఘ లేఖ రాసిన డీఎస్, అందులోనే తాను పార్టీ వీడుతున్న విషయాన్ని తెలిపారు. నిన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన డీఎస్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామాను ప్రకటించారు. నాలుగు దశాబ్దాల పాటు తనకు పలు పదవులిచ్చిన కాంగ్రెస్ పార్టీకి లేఖలో డీఎస్ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అదే సమయంలో తాను పార్టీకి చేసిన సేవలను కూడా అందులో డీఎస్ పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీకి జరిగిన నష్టానికి గల కారణాలనూ ఆయన పేర్కొనడం గమనార్హం. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేేసిన పోరాటాన్ని కూడా ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News