: రేవంత్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు: టీఆర్ఎస్ నేత కర్నె
రేవంత్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని టీఆర్ఎస్ నేత కర్నే ప్రభాకర్ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి భాష సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని అన్నారు. తప్పు చేసిన రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలైతే టీడీపీ సంబరపడిపోతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఎవరైనా జైలుకు వెళ్తే పశ్చాత్తాప పడతారని, రేవంత్ రెడ్డి ప్రవర్తన చిల్లరగా ఉందని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి వచ్చింది బెయిల్ మాత్రమేనని గుర్తుంచుకోవాలని, విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. తప్పు చేసిన వాడికి శిక్షతప్పదని ఆయన పేర్కొన్నారు.