: తాగుబోతు జాతిపిత అయితడా?: రేవంత్


తాగుబోతును జాతిపిత అని సన్నాసులు అంటున్నారని, తాగుబోతు ఎక్కడైనా జాతిపిత అయితడా? అని రేవంత్ ప్రశ్నించారు. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన అనంతరం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ, "రెండు పెగ్గులేస్తే కానీ లేవలేని సన్నాసి ఉద్యమాన్ని నడిపాడని అంటున్నారు. అంతేకాదు, తెలంగాణ జాతి పిత అని కూడా అంటున్నారు. ఈ సన్నాసి ఉద్యమం చేస్తే ఆ సన్నాసులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు" అన్నారు ఆవేశంగా. అలా అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను ఏమంటారని ఆయన నిలదీశారు. వారి త్యాగాలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. అమర వీరుల వల్లే తెలంగాణ సాధ్యమైందని, రాష్ట్ర సాధన తమ వల్లే అయిందని ఎవరూ ఆపాదించుకోవద్దని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News