: బిడ్డా, కేసీఆర్! వస్తున్నా...!: రేవంత్ రెడ్డి


'బిడ్డా, కేసీఆర్! వస్తున్నా...' అంటూ టీడీపీ నేత రేవంత్ రెడ్డి వేకప్ కాల్ ఇచ్చారు. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మాట్లాడుతూ, "నాకు బెయిల్ వచ్చింది, కేసీఆర్ కు లాగు తడుస్తోంది" అన్నారు. కేసీఆర్ నేర చరిత్ర తెలిసిన వారు కొంత మంది జైలులో తనను కలిశారని, కేసీఆర్ బండారం బయటపెడతానని అన్నారు. "కేసీఆర్... నువు నిజంగా తెలంగాణ వాడివే అయితే, నీలో ప్రవహించేంది తెలంగాణ రక్తమే అయితే, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన వారిని రాజీనామా చేయించు" అంటూ సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News