: అందుకోసమే ఇంత కష్టపడ్డాను: అర్జున్ కపూర్


సెలబ్రిటీ స్టేటస్ కోసమే ఇంత కష్టపడ్డానని బాలీవుడ్ యువహీరో అర్జున్ కపూర్ తెలిపాడు. 'ఇషక్ జాదే' సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయమైన అర్జున్ కపూర్ '2స్టేట్స్', 'తేవర్', 'ఫైండింగ్ ఫెనీ' వంటి సినిమాలతో స్టార్ హోదా సాధించాడు. ఈ హోదా కోసమే ఇంత కష్టపడ్డానని అర్జున్ వెల్లడించాడు. కొంతమంది తారలు స్టార్ స్టేటస్ వల్ల ఇబ్బంది పడుతున్నామని అంటారని, అది సరికాదని అర్జున్ చెప్పాడు. స్టార్ డమ్ కోసమే అంతా కష్టపడతారని, ఈ స్టార్ డమ్ ను ఆస్వాదిస్తున్నానని అర్జున్ కపూర్ తెలిపాడు. కాగా, అర్జున్ కపూర్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమారుడు.

  • Loading...

More Telugu News