: చర్లపల్లి జైలు నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు ర్యాలీగా బయల్దేరిన రేవంత్


ఓటుకు నోటు కేసులో నెల రోజుల పాటు రిమాండ్ లో ఉన్న టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం చర్లపల్లి జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. వేలాదిగా జైలు వద్దకు తరలి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ ఆయన బయటకు వచ్చారు. అనంతరం చర్లపల్లి జైలు నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు ఆయన ర్యాలీగా బయలుదేరారు. ఆయన వెంట టీడీపీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా ఉన్నారు. రేవంత్ ర్యాలీని ఆయన అభిమానులు టీడీపీ జెండాలు చేతబట్టి అనుసరిస్తున్నారు. చర్లపల్లి ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో, ర్యాలీ మెల్లిగా కదులుతోంది. ర్యాలీ మధ్యలో రేవంత్ కు ఒక అభిమాని 'సింహాద్రి' సినిమాలో ఉపయోగించిన కత్తిలాంటిదాన్ని బహూకరించాడు. ఆ కత్తిని రేవంత్ పైకెత్తి అభిమానులను ఉత్సాహపరిచారు.

  • Loading...

More Telugu News