: తెలంగాణ, ఏపీలో గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు


తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న ఉదయం 6.26 నుంచి 6.38 నిమిషాల మధ్య పుష్కరాలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలంగాణ దేవాదాయ శాఖ తెలిపింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణలో జరుగుతున్న తొలి పుష్కరాలు ఇవే కావడంతో పుష్కర వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక ఏపీ పుష్కరాల ప్రారంభ ముహూర్తం కూడా 14న ఉదయం 6.26 నుంచి 6.38 నిమిషాల మధ్య ఖారారు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News