: చర్లపల్లి జైలు వద్దకు చేరుకున్న రేవంత్ కుటుంబ సభ్యులు


ఓటుకు నోటు కేసులో చర్లపల్లి జైల్లో ఉన్న టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి కాసేపట్లో బెయిల్ పై విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన భార్య గీత, కుమార్తె నైమిశ, ఇతర కుటుంబ సభ్యులు జైలు వద్దకు చేరుకున్నారు. రేవంత్ కుటుంబ సభ్యులు జైలు వద్దకు రావడంతో అక్కడ సందడి నెలకొంది. మరోవైపు రేవంత్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. చర్లపల్లి జైలు పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.

  • Loading...

More Telugu News