: మహారాష్ట్ర మంత్రి పంకజ ముండేపై కొత్త ఆరోపణలు!


మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండేపై కొత్త ఆరోపణలు వచ్చాయి. ఓ ప్రైవేటు కంపెనీకి డ్యాం బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇచ్చే విషయంలో మంత్రి నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జాల్నా జిల్లాలో చిన్న ఆనకట్టలు నిర్మించేందుకు పారిశ్రామికవేత్త రత్నాకర్ గుట్టే నేతృత్వంలోని ఓ ప్రైవేటు కంపెనీకి మంత్రి పర్యవేక్షణలోని గ్రామీణాభివృద్ధి సంస్థ కాంట్రాక్టు ఇచ్చింది. అయితే, అంతకుముందు తక్కువ మొత్తానికి బిడ్ వేసినప్పటికీ, సదరు కంపెనీ సాంకేతిక కారణాలతో అనర్హతకు గురైంది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీకే తాజాగా కాంట్రాక్ట్ ఇవ్వడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను పంకజ తిరస్కరించారు. ఇదంతా రాజకీయ కుట్ర అని ఆమె ఖండించారు. ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు పంకజ ఇన్ ఛార్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల ఆహార పదార్థాలు, పుస్తకాలు, వాటర్ పిల్టర్ల కొనుగోలులో రూ.200 కోట్ల స్కాం గురించి గతవారం ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈలోగా మరో వివాదంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News