: తిరుమల వచ్చిన ప్రతిసారీ మరింత శక్తి పొందా: రాష్ట్రపతి


శ్రీవారిని దర్శించుకునేందుకు తాను ఎన్నోసార్లు తిరుమల వచ్చినట్టు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. వచ్చిన ప్రతిసారీ మరింత శక్తి పొందానని తెలిపారు. ప్రజలందరికీ సుఖ సంతోషాలు కల్పించాలని దేవుడిని ప్రార్థించినట్టు పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రపతి పద్మావతి అతిథిగృహానికి వెళ్లారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని, వరాహస్వామిని రాష్ట్రపతి, ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ దర్శించుకున్నారు. వారితో పాటు గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు, ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తదితరులు ఉన్నారు. చివరగా స్వామివారి తీర్థప్రసాదాలను రాష్ట్రపతికి అందించి, వేదపండితులు ప్రణబ్ కు ఆశీర్వచనం పలికారు.

  • Loading...

More Telugu News