: కాంగ్రెస్ ను ఎవరూ వీడడం లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ వీడడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీనియర్ నేతలు జానారెడ్డి, డీఎస్ కాంగ్రెస్ పార్టీని వీడరని అన్నారు. జానారెడ్డి, డీఎస్ లు పార్టీ వీడుతారంటూ వస్తున్న వార్తలన్నీ పుకార్లని ఆయన తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్ ను డీఎస్ పలకరించడానికి వెళ్లారని, జానారెడ్డితో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ భేటీ గురించి తనకు తెలియదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వానికి ఢోకా లేదని, భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు.