: కపిల్ శర్మ కు అనారోగ్యం...షోకు బ్రేక్
బుల్లితెర కామెడీ నటుడు కపిల్ శర్మ స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షో 'కామెడీ సర్కస్' ద్వారా పరిచయమైన కపిల్ శర్మ తిరుగులేని ప్రజాదరణ సొంతం చేసుకున్నాడు. హాస్యరస ప్రధాన కార్యక్రమం 'కామెడీ నైట్స్ విత్ కపిల్'లో పాల్గొనేందుకు, వీక్షించేందుకు అభిమానులు తహతహలాడుతారు. కామెడీ షో ద్వారా బాలీవుడ్ సినిమాలను అభిమానులకు పరిచయం చేసే కపిల్, సల్మాన్ ఖాన్ తో షో పూర్తి చేశాడు. 'భజరంగీ భాయ్ జాన్' సినిమా ప్రమోషన్ లో భాగంగా కపిల్ షో లో సల్లూభాయ్ సందడి చేయనున్నాడు. ఈ షో ముగిసిన తరువాత కపిల్ కొంత కాలం విరామం తీసుకోనున్నాడు.