: కేసీఆర్ కు ఏం జ్వరమొచ్చిందో... రాష్ట్రపతి సమక్షంలో చంద్రబాబుతో సమావేశమైతే బాగుండేది: జూపూడి


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబు, కేసీఆర్ లు సమావేశమైతే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని తాము భావించామని... అయితే, ఆయనకు ఏం జ్వరం వచ్చిందో కాని, సమావేశానికి మాత్రం రాలేదని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. కావాలనే కేసీఆర్ సమావేశానికి రాలేదని అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా విమర్శించుకున్నా, పాలన పరంగా సహకరించుకుందామని చంద్రబాబు చెబుతున్నప్పటికీ... తెలంగాణ ప్రభుత్వం మాత్రం ముందుకు రావడం లేదని అన్నారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి వచ్చిన మంచి అవకాశాన్ని కేసీఆర్ ఎందుకు వినియోగించుకోలేకపోయారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News