: భారీ వర్షాలతో డార్జిలింగ్ అతలాకుతలం... విరిగిపడుతున్న కొండ చరియలు
పశ్చిమ బెంగాల్ లో కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడి జనజీవనం స్తంభించింది. సుందర డార్జిలింగ్ కూడా అతలాకుతలం అయింది. అక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో, ఇప్పటి వరకు సుమారు 20 మంది చనిపోగా, మరో 15 మంది గల్లంతయ్యారు. రోడ్డు మార్గాలపై కొండ చరియలు విరిగిపడటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. మరోవైపు, అక్కడ నుంచి సిక్కింకు మధ్య ఉన్న టెలి కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, డార్జిలింగ్ ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు.