: 'బాహుబలి' కోసం ప్రత్యేకంగా సినిమాలేవీ చూడలేదు: రాజమౌళి


ప్రభాస్ హీరోగా వస్తున్న బాహుబలి చిత్రం ఇప్పుడు అందరిలోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనిపై నానాటికీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా గురించి రాజమౌళి ఓ తెలుగు వార్తా చానల్ తో మాట్లాడారు. 'బాహుబలి' చిత్రంలోని యుద్ధ సన్నివేశాల కోసం ఏవైనా హాలీవుడ్ సినిమాలు చూశారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ... బాహుబలి కోసం ప్రత్యేకంగా సినిమాలేవీ చూడలేదని స్పష్టం చేశారు. అయితే, తనకు యుద్ధ సన్నివేశాలుండే చిత్రాలంటే మొదటి నుంచి ఎంతో ఆసక్తి అని తెలిపారు. బాహుబలి కంటే ముందే ఎన్నో హాలీవుడ్ హిట్ చిత్రాలు చూశానని, బెన్ హర్, టెన్ కమాండ్ మెంట్స్, క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్ వంటి సినిమాలు బాగా ఇష్టమని చెప్పారు. ఇటీవల తనపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై స్పందిస్తూ..."మనం ఓ సీన్ తీస్తే ఆ సీన్ ఏ సినిమా నుంచి కాపీ కొట్టారని కొందరు రంధ్రాన్వేషణ చేస్తుంటారు. ఈ సీన్ ఆ సినిమా నుంచి లిఫ్ట్ చేశారు, ఆ సీన్ అందులోది... అంటూ విమర్శిస్తుంటారు. కొందరికి అదే పని" అని అన్నారు.

  • Loading...

More Telugu News