: మద్యం దుకాణంపై మహిళాగ్రహం!
జనావాసాల మధ్య ఉన్న ఓ మద్యం దుకాణంపై మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా షాపులోకి వెళ్లిన మహిళలు అక్కడి సీసాలను, ఫర్నీచరును ధ్వంసం చేసి మద్యం భూతానికి వ్యతిరేకంగా తమ తీవ్ర నిరసనను తెలిపారు. ఈ ఘటన కాకినాడలో జరిగింది. ఇళ్ల మధ్య ఉన్న వైన్ షాపు కారణంగా తమ కాపురాలు కూలిపోతున్నాయని, ఇక్కడ తిష్టవేస్తున్న తాగుబోతుల ఆగడాలు భరించలేక విసుగొస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పోకిరీల వేధింపులు ఎక్కువయ్యాయని, తక్షణం దుకాణాన్ని అక్కడి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.