: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం


ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియను విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో 1230, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 755 సీట్ల భర్తీకి ఈ నెల మూడో వారంలో కౌన్సెలింగ్ ఆరంభించనున్నారు. ఆగస్టు మొదటివారంలో ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభిస్తారు. ఈ ఏడాది 224 సూపర్ న్యూమరీ సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయ బిల్లుపై కేబినెట్ భేటీలో చర్చించి ట్రిపుల్ ఐటీల్లో శాశ్వత ఫాకల్టీకి చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా చెప్పారు. తిరుపతి, అమరావతి, విశాఖలను విద్యానగరాలుగా అభివృద్ధి చేస్తామని గంటా ప్రకటించారు.

  • Loading...

More Telugu News