: కాంగ్రెస్ గెలిచినా... ఆనందంలో బీజేపీ!
కేరళ ఉపఎన్నికలో వచ్చిన ఫలితాలు బీజేపీ శిబిరంలో ఆనందాన్ని నింపాయి. అరువిక్కార నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించినా, తొలిసారిగా రాష్ట్రంలో ముక్కోణపు పోటీని, కాంగ్రెస్, కమ్యూనిస్టులకు దీటుగా బీజేపీ ఎదిగిన తీరుకు ఎన్నికల ఫలితం నిదర్శనంగా నిలిచింది. 2011 ఎన్నికల్లో కేవలం 7 వేల ఓట్లతో సరిపెట్టుకున్న బీజేపీ, ఈ ఉపఎన్నికల్లో ఏకంగా 23.96 శాతం ఓట్లను దక్కించుకుంది. అరువిక్కార నియోజకవర్గానికి ఎన్నిక జరుగగా, కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ శబరీనాథన్ విజయం సాధించగా, బీజేపీ అభ్యర్థి ఓ రాజగోపాల్ కు 34 వేల ఓట్లు వచ్చాయి. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారంలోకి వస్తామని ఘంటాపథంగా చెబుతున్న ముఖ్యమంత్రి చాందీ సైతం బీజేపీ ఎదుగుతున్న తీరును అంగీకరించారు. తమ పార్టీకి పెరుగుతున్న ఆదరణ మరింత కాలం కొనసాగుతుందని, వచ్చే సంవత్సరానికి మరింత ప్రభావం చూపుతామని, ఉపఎన్నికల్లో ఓడిపోయినా తమ పనితీరు ఆనందాన్ని కలిగించిందని రాజగోపాల్ వ్యాఖ్యానించారు.