: సుష్మ, వసుంధరలను పదవుల నుంచి తప్పించండి... పార్లమెంటులో మీకు సహకరిస్తాం: బీజేపీకి కాంగ్రెస్ రాయబారం


కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలను పదవుల నుంచి తొలగిస్తే... పార్లమెంటులో బిల్లులు పాస్ కావడానికి సహకరిస్తామని కాంగ్రెస్ పార్టీ బీజేపీకి రాయబారం పంపింది. ఈ మేరకు ఆంగ్ల పత్రికలలో కథనాలు వచ్చాయి. లోక్ సభలో బిల్లులు పాస్ చేయించడానికి ఎన్డీయేకు ఎలాంటి ఇబ్బంది లేదు... ఎందుకంటే, అక్కడ ఎన్డీయేకి పూర్తి మెజారిటీ ఉంది. రాజ్యసభ విషయానికొస్తే... అక్కడ బిల్లులు పాస్ కావాలంటే కాంగ్రెస్ మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఈ రాయబారం పంపడం ఆసక్తికరంగా ఉన్నప్పటీకీ... బీజేపీ మాత్రం వీరిద్దరినీ పదవుల నుంచి తొలగించడానికి సుముఖంగా లేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News