: క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ తో డీఎస్ భేటీ
హైదరాబాద్ లోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎస్ ఈ నెల 6న టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు టీఆర్ఎస్ తనను ఆహ్వానించిన మాట నిజమేనని, తానింకా నిర్ణయం తీసుకోలేదని డీఎస్ కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేగాక టీఆర్ఎస్ లో డీఎస్ చేరిక స్పష్టమైందనే చెప్పాలి. ఈ క్రమంలో పార్టీలో ఎప్పుడు చేరాలి? వంటి విషయాలపై కేసీఆర్ తో ఆయన చర్చిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజనతో ప్రాబల్యం కోల్పోయిన కాంగ్రెస్ కు డీఎస్ పార్టీ మారడం తెలంగాణలో ఎదురుదెబ్బనే చెప్పాలి.