: రాజమండ్రిలో నిరాహారదీక్ష చేస్తున్న పురోహితులు


అన్ని పుష్కర ఘాట్లలో పిండప్రదానాది క్రియలకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, శ్రీ ఉమామహేశ్వరస్వామి పుష్కర ఘాట్ వద్ద పురోహితులు ఈ ఉదయం నిరాహారదీక్ష మొదలు పెట్టారు. సంప్రదాయ క్రతువులకు ఆంక్షలు పెట్టడమేంటని వారు అధికారులను ప్రశ్నించారు. లక్షలాదిగా వచ్చే భక్తుల్లో అత్యధికులు పిండప్రదానాలు చేయాలని కోరుకుంటారని, అటువంటిది ఘాట్ల వద్ద ఆంక్షలు పెట్టి అటు యాత్రికులను, ఇటు పురోహితులను ఇబ్బంది పెట్టవద్దని కోరుతున్నారు. కాగా, రాజమండ్రి పరిధిలో 100కు పైగా పుష్కర ఘాట్లుండగా, కేవలం మూడు పుష్కర ఘాట్లలోనే పిండ ప్రదానానికి అధికారులు అనుమతి ఇవ్వడం విమర్శలకు గురైంది.

  • Loading...

More Telugu News