: నవ్యాంధ్రలో హైవేలపై ఉచిత ఫోన్లు


జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల గురించి తక్షణ సమాచారం తెలుసుకునేందుకు నవ్యాంధ్రలోని ప్రధాన హైవేలపై ప్రతి కిలోమీటరుకు ఒక ఉచిత టెలిఫోన్ బూత్ ఏర్పాటైంది. అయితే, ఇవి ఎవరికైనా ఫోన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించవు. ఈ బూత్ లలోని రెడ్ బటన్ నొక్కితే సమీపంలోని హైవే నిఘా విభాగాలకు కాల్ వెళుతుంది. ప్రమాదం జరిగిన ప్రదేశం గురించి అధికారులకు క్షణంలో తెలిసిపోతుంది. ఆ వెంటనే అక్కడికి పెట్రోలింగ్ వాహనం, ఆపై అవసరమైతే ఆంబులెన్స్, వాహనాలను తొలగించేందుకు క్రేన్లు తరలివస్తాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య ఉన్న జాతీయ రహదారిపై వీటిని ఏర్పాటు చేశారు. వీటితో పాటు నిఘా కెమెరాలు కూడా అమర్చారు. ఈ ఫోన్, వీడియోల పనితీరును మంగళగిరి టోల్ ప్లాజా వద్ద ఉన్న కంట్రోల్ రూం పర్యవేక్షిస్తుంటుంది. టోల్ ప్లాజా నుంచి యడ్లపాడు వరకూ 50 ఫోన్ బూత్ లను, కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. మరో రెండు రోజుల్లో ఇవి పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తాయని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News