: ఎడారిని తలపిస్తున్న బాసర గోదావరి... కేసీఆర్ పుష్కర స్నానం ధర్మపురిలో!


మరో రెండు వారాల్లో గోదావరి నది పుష్కరాలు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి వద్ద నదిలో పుష్కలంగా నీరుంటే, ఎగువన మాత్రం చుక్కనీరు లేక నది ఎడారిని తలపిస్తోంది. ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు వస్తారని భావిస్తున్న బాసర క్షేత్రం వద్ద చుక్కనీరు లేని పరిస్థితి నెలకొంది. బాబ్లీ గేట్లు ఎత్తి ఉన్న 0.6 టీఎంసీల నీరు, ఎస్‌ఆర్‌ఎస్పీలో నిల్వ ఉన్న నాలుగు టీఎంసీల నీటిని వదిలినా, బాసరకు నీరు చేరే అవకాశాలు లేవు. ఈ నీరు నిర్మల్, లక్ష్మణచాంద, మామడ, కడెం, దండెపెల్లి, లక్సెటిపేట్, మంచిర్యాల, చెన్నూర్ వరకు ఉన్న గోదావరి ఘాట్ల అవసరాలకు మాత్రమే సరిపోతుంది. ఈ పది రోజుల్లో గోదావరి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడితేనే నీరు వస్తుంది. నీరు రాకుంటే జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈసారి కరీంనగర్ జిల్లా ధర్మపురి వద్ద పుష్కరస్నానం చేసేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇటీవలి వర్షాలకు ధర్మపురి వద్ద నదిలో నీటి మట్టం పెరిగింది. స్నానాలు ఆచరించేందుకు అనువైన ప్రదేశం కూడా ఉండడంతో కేసీఆర్ అక్కడే పుష్కరస్నానం ఆచరించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధ్రువీకరించారు. కేసీఆర్ పుష్కర స్నాన ఏర్పాట్లు ధర్మపురిలో జరుగుతున్నట్టు ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News