: జపాన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు


నవ్యాంధ్రకు పెట్టుబడుల ఆహ్వానమే ముఖ్య లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రోజుల పాటు జపాన్‌ లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన ప్రయాణ తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 5 నుంచి మూడు రోజుల పాటు పర్యటన సాగనుంది. 5వ తేదీన టోక్యోకు చేరుకునే ఆయన, ఆపై రెండు రోజుల్లో సాఫ్ట్‌ బ్యాంక్, సుమిటొమో, మిత్సుబిషి, మయేకవ తదితర కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 6వ తేదీన జపాన్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక మంత్రితో చంద్రబాబు భేటీ కానున్నారు. ఏడో తేదీ సాయంత్రం జపాన్‌ లోని భారతీయులను ఉద్దేశించి బాబు మాట్లాడనున్నారు. కాగా, జపాన్ ప్రధాని షింజో అబేతో బాబు సమావేశమవుతారా? లేదా? అన్న విషయం ఇంకా ఖరారు కాలేదు.

  • Loading...

More Telugu News