: కేసీఆర్ కోసమూ ఓ బస్సొస్తోంది!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఓ ప్రత్యేక బస్సును తయారు చేయించుకుని, రాజధాని ప్రాంతంలో తిరిగేందుకు వినియోగిస్తూ, దాన్నుంచే పర్యటనలు సాగిస్తూ, పరిపాలనను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. అదే దారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నడవనున్నారు. టీ-సీఎం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బస్సు నేడు హైదరాబాద్ నగరానికి రానుంది. ఈ వాహనంలో సీఎం పర్యటనలు జరుగుతాయని తెలుస్తోంది. ఎల్లుండి నుంచి వారం రోజుల పాటు కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని 10 జిల్లాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ బస్సులోనే పర్యటిస్తూ, వివిధ ప్రాంతాల్లో జరిగే మొక్కలు నాటే కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన బస్సులో పడకగది, స్నానాల గదితో పాటు చిన్న చిన్న సమావేశాలు, సమీక్షలు జరిపేందుకు ఏర్పాట్లున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News