: హ్యాండ్ బ్యాగ్ తో ప్రయాణిస్తే వెయ్యి డిస్కౌంట్ : స్పైస్ జెట్
బంపర్ ఆఫర్లతో విమాన యానాన్ని అందిస్తున్న స్పైస్ జెట్ ప్రయాణికులకు మరో ఆఫర్ ప్రకటించింది. డబ్బు ఆదా, ఇంధనం ఆదా, పర్యావరణ పరిరక్షణ పేరిట ఓ ఆపర్ ను స్పైస్ జెట్ ప్రయాణికులకు అందజేస్తున్నట్టు తెలిపింది. తమ సంస్థకు చెందిన విమానాల్లో అదనపు లగేజీ లేకుండా, కేవలం హ్యాండ్ బ్యాగ్ తో ప్రయాణించే వారికి టికెట్ పై వెయ్యి రూపాయల డిస్కౌంట్ అదిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం నెల రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుందని స్పైస్ జెట్ స్పష్టం చేసింది. 30 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్నవారు ఎక్కువ లగేజీతో వస్తే ఈ ఆఫర్ వర్తించదని స్పైస్ జెట్ తెలిపింది.