: నోటీసులు ఇస్తే మా నెత్తిన పాలు పోసినట్టే... నోటీసులు ఇవ్వాలనే కోరుకుంటున్నాం: లోకేశ్


తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ విషయాన్ని తెగేవరకు లాగకూడదని టి.సర్కారుకు హితవు పలికారు. అందితే జట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే కేసీఆర్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ భయం లేకుంటే... తెలంగాణ సర్కారు హోం శాఖ కార్యదర్శిని ఎందుకు మార్చిందని ప్రశ్నించారు. ఇంటెలిజన్స్ చీఫ్ దీర్ఘకాలిక సెలవుపై ఎందుకు వెళ్లారని లోకేశ్ అడిగారు. ఓటుకు నోటు వ్యవహారంలో, తెలంగాణ సర్కారు తమకు నోటీసులు ఇస్తే తమ నెత్తిన పాలు పోసినట్టేనని, నోటీసులు ఇవ్వాలనే తాము కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఎదురుపడలేకనే కేసీఆర్ గవర్నర్ విందుకు గైర్హాజరయ్యారని ఎద్దేవా చేశారు. నాలుగు రోజులు ఫాం హౌస్ లో ఉన్న కేసీఆర్ కు ఇప్పుడు జ్వరం వచ్చిందా? అంటూ లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News