: తెలంగాణ హోం శాఖ కార్యదర్శిగా రాజీవ్ త్రివేదీ...ట్యాపింగ్ వ్యవహరమే కారణమా?
తెలంగాణ హోం శాఖ కార్యదర్శిగా రాజీవ్ త్రివేదీ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో హోం శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం లీవ్ మీద ఉన్నారు. దీంతో ఆయనను తెలంగాణ ప్రభుత్వం కావాలనే తప్పించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. లీవ్ లో ఉన్న ఆయన స్థానంలో తాజాగా ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేదీ నియామకంతో ఆరోపణలు నిజమేనన్న ప్రచారం జరుగుతోంది.