: బాబు దొరికారు...కేసీఆర్ దొరకలేదు: డిగ్గీరాజా


ఓటుకు నోటు కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దొరకలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చమత్కరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఓటుకు నోటు కుంభకోణాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని ఆయన తెలిపారు. ఓటుకు నోటు కుంభకోణంలో ఆ గొంతు తనదో కాదో చంద్రబాబునాయుడు ఇంకా చెప్పలేదని డిగ్గీరాజా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News