: వన్డే టీమ్ లోకి మళ్లీ వస్తానని ముందే ఊహించా: మురళీ విజయ్


తనకు మళ్లీ భారత వన్డే జట్టులో స్థానం లభిస్తుందని ముందే ఊహించానని బ్యాట్స్ మెన్ మురళీ విజయ్ తెలిపాడు. రహానే సారథ్యంలో జింబాబ్వేకు వెళుతున్న టీమిండియా జట్టులో మురళికి స్థానం దక్కిన సంగతి తెలిసిందే. సీనియర్లకు విశ్రాంతిని ఇచ్చి, యువకులకు బీసీసీఐ అవకాశం కల్పించడంతో మురళికి వన్డే జట్టులో మళ్లీ స్థానం దక్కింది. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ, టెస్టుల్లో రాణించిన తర్వాత తన ఆత్మవిశ్వాసం మరింత మెరుగు పడిందని చెప్పాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సహా నాలుగు సిరీస్ లకు మూడో ఓపెనర్ గా తనను జట్టులోకి తీసుకున్నా, ఆడటానికి మాత్రం అవకాశం రాలేదని తెలిపాడు. అయితే, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, టెస్టుల్లో రాణించానని అన్నాడు.

  • Loading...

More Telugu News