: మిస్టర్ హోలండే, ఏం చేద్దామంటారు?: ఒబామా


'మిస్టర్ హోలండే, గ్రీస్ సంక్షోభంపై ఏం చేద్దామంటారు?' అంటూ బరాక్ ఒబామా, ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఫోన్ చేశారు. గ్రీస్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండే కు ఫోన్ చేసిన ఒబామా గ్రీస్ సంక్షోభ పరిష్కార చర్యలపై చర్చించారు. గ్రీస్ కు అందించాల్సిన సాయంపై ఓ అవగాహనకు వచ్చారు. దీంతో ఫ్రాన్స్, అమెరికాలు సంయుక్తంగా గ్రీస్ ను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు చర్యలు తీసుకోనున్నాయని వైట్ హౌస్ వెల్లడించింది. అలాగే ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడిపై సంతాపం వ్యక్తం చేశారని, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్, అమెరికా కలిసి పనిచేస్తాయని శ్వేత సౌధం పేర్కొంది. అనంతరం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ కు ఫోన్ చేసిన ఒబామా, ట్యూనీషియా దుర్ఘటనపై సంతాపం వ్యక్తం చేశారని వైట్ హౌస్ తెలిపింది.

  • Loading...

More Telugu News