: 2,900 ఏళ్ల క్రితం పేలిన అగ్ని పర్వతం మళ్లీ పేలడానికి సిద్ధం
సుమారు 2900 ఏళ్ల క్రితం పేలిన అగ్నిపర్వతం మళ్లీ పేలడానికి సిద్ధంగా ఉంది. జపాన్ లోని కనగవా ప్రాంతంలో మౌంట్ హకోన్ అగ్నిపర్వతం పేలడానికి సిద్ధంగా ఉంది. దీంతో జపాన్ అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మౌంట్ హకోన్ పర్వత ప్రాంతానికి కిలో మీటర్ దూరం వరకు ఎవర్నీ అనుమతించడం లేదు. పర్వత ప్రాంతానికి దగ్గర్లో ఉండే ప్రజలను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏ క్షణంలో అయినా పర్వతం పేలే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు.