: ఆంధ్రోళ్లారా...రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఖబడ్దార్!: మహేందర్ రెడ్డి
'ఆంధ్రోళ్లారా...రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఖబడ్దార్' అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రా నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని, వాళ్లు రెచ్చగొట్టినా తాము రెచ్చిపోమని అన్నారు. ఓటుకు నోటు కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన చెప్పారు. కేవలం చంద్రబాబును కాపాడేందుకు ఆంధ్రా నేతలు సెక్షన్ 8 గళం అందుకున్నారని ఆయన ఆక్షేపించారు. ఆంధ్రోళ్లు రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాదులో ఆంధ్రప్రజలకు తాము అండగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు.