: ఇళ్లపై కూలిన విమానం...113 మంది మృతి


ఇండోనేసియాలోని మెడాస్ నగరంలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం ఒకటి కుప్పకూలింది. ఈ విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే నివాస స్థలాలపై కుప్పకూలడం విశేషం. ఈ ప్రమాదంలో 113 మంది మృతి చెందారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, విమానం కుప్పకూలినప్పుడు ఈ భవనాల్లో ఎంత మంది ఉన్నారన్నది లెక్క తేలడం లేదని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో పార్క్ చేసిన కార్లు బూడిదకుప్పగా మారాయని చెబుతున్నారు. ఈ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, పక్కనే ఉండే ఇంటర్నేషనల్ స్కూల్ లో తాను పని చేస్తున్నానని, విమానం అత్యంత తక్కువ ఎత్తులో ఎగురుతూ వస్తోందని, దీంతో కిటీకీలోంచి చూడగా, కళ్ల ముందే కుప్పకూలిపోయిందని చెప్పారు. అది చాలా భయంకరమైన అనుభవమని ఆమె చెప్పారు. కూలిన భవన శిథిలాలలో తమవారిని వెతుక్కునేందుకు స్థానికులు బారులు తీరారు. శిథిలాలను వెలికితీసేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

  • Loading...

More Telugu News