: హైదరాబాదులో సెక్షన్-8 ఉండాల్సిందే: ఏపీ డీజీపీ


ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్-8 ఉండాల్సిందేనని ఏపీ డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. అవసరం ఉంది కాబట్టే సెక్షన్-8 అమలు కావాలని కోరుతున్నామని చెప్పారు. ఓటుకు నోటు కేసులో అత్యంత కీలకమైన ఫోన్ ట్యాపింగ్ అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ పోలీసులతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. గ్యాస్ పైప్ లైన్ల భద్రతపై సమీక్ష నిర్వహించిన డీజీపీ... చమురు సంస్థల సీఈవోలకు, సెక్యూరిటీ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు. చమురు సంస్థలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News