: కేరళ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం


కేరళలోని అరువికార అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కేఏ సబరినాథ్(31) విజయం సాధించారు. సమీప సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం.విజయకుమార్ పై 10,128 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక బీజేపీ అభ్యర్థి ఓ.రాజగోపాల్ 34,145 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అరువికార నియోజకవర్గానికి గత 24 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ రాష్ట్ర మాజీ స్పీకర్ జీ.కార్తికేయన్ ఇటీవల అకస్మాత్తుగా మరణించారు. దాంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన కుమారుడు సబరినాథనే తిరిగి తండ్రి నియోజకవర్గానికి పోటీచేసి గెలుపొందారు.

  • Loading...

More Telugu News