: రహానేకు కెప్టెన్సీ దక్కడంపై సచిన్ స్పందన


జింబాబ్వే పర్యటనకు ధోనీ, కోహ్లీ వంటి బడా స్టార్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ బ్యాట్స్ మన్ అజింక్యా రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించడం తెలిసిందే. ముంబై క్రికెటర్ కు కెప్టెన్సీ అప్పగించడంపై బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. కెప్టెన్ గా ఎంపికైనందుకు రహానేకు అభినందనలు తెలిపారు. "అజింక్యాకు కెప్టెన్సీ దక్కడం చాలా సంతోషం కలిగించింది. అతను చిత్తశుద్ధి కలిగిన క్రికెటర్. కఠోరంగా శ్రమిస్తాడు. ఆట పట్ల అతని నిబద్ధత, అంకితభావం ఎల్లప్పుడూ నన్ను ఆకట్టుకునేవి. కెప్టెన్ గా రాణించి, మాకందరికీ గర్వకారణంగా నిలుస్తాడని కచ్చితంగా చెప్పగలను. అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను" అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News