: ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన వైకాపా


ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వైకాపా నేత, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎన్నికల్లో అధికార టీడీపీ అనేక అరాచకాలకు పాల్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారం చోటు చేసుకుంటోందని గవర్నర్ నరసింహన్ కు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని చెప్పారు. టీడీపీ అరాచకాలను నిరసిస్తూ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట వైకాపా నేతలు నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.

  • Loading...

More Telugu News