: గ్రీస్ దారిలో మరో దేశం... దివాలా తీసిన ప్యూర్టో రికో
గ్రీస్ సంక్షోభం ఇతర దేశాలకు కూడా పాకుతోంది. యూఎస్ దివాలా చట్టం ప్రకారం తమ రుణాలను పునర్వ్యవస్థీకరించాలని ప్యూర్టో రికో గవర్నర్ అలెగ్జాండ్రో గార్సియా పడిల్లా అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన దివాలా పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ బాండ్లను కలిగివున్న వారు తప్పనిసరిగా త్యాగం చేయాల్సిందేనని అన్నారు. అమెరికా ప్రభుత్వం తాము దివాలా తీశామని గుర్తించి రుణాలను రీస్ట్రక్చర్ చేయాలని ఆయన కోరారు. కాగా, కరేబియన్ దీవుల్లో భాగమైన ప్యూర్టో రికో 73 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 4.67 లక్షల కోట్లు) రుణాలను చెల్లించాల్సి వుంది. ఇందులో అత్యధిక భాగం అంతర్జాతీయ ద్రవ్య నిధికి చెల్లించాల్సివుంది. ప్రస్తుతం ప్యూర్టో రికో కనీసం వడ్డీలను చెల్లించే పరిస్థితిలో కూడా లేదు. ప్యూర్టో రికోను తక్షణం ఆదుకోకుంటే పరిస్థితి మరింతగా దిగజారుతుందని యూఎస్ దివాలా కోర్టు రిటైర్డ్ జడ్జి స్టీవెన్ రోడ్స్ హెచ్చరించారు.