: రాష్ట్రపతిని కలిసి పరిస్థితిని వివరించిన గవర్నర్ నరసింహన్
వర్షాకాల విడిది నిమిత్తం నిన్న హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడంతా భేటీలతో బిజీగా గడుపుతున్నారు. ఈ మధ్యాహ్నం చంద్రబాబుతో సమావేశానికి ముందే, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతితో భేటీ అయ్యారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వచ్చిన గవర్నర్ సుమారు 40 నిమిషాల పాటు రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కుదిపేస్తున్న ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలతో పాటు సెక్షన్-8 అమలుపైనా తన వద్ద ఉన్న సమాచారాన్ని ప్రణబ్ తో పంచుకున్నట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిణామాలపై నరసింహన్ వివరణ ఇచ్చినట్టు సమాచారం.