: లక్షన్నర ఓట్ల మెజారిటీతో జయ విజయం... ఓట్ల శాతం పరంగా ఆల్ టైం రికార్డు!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రికార్డు విజయం సాధించారు. చెన్నై పరిధిలోని ఆర్కే నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 17 రౌండ్ల లెక్కింపు జరుగగా, జయలలితకు 1,60,921 ఓట్లు వచ్చాయి. ఆమె సమీప అభ్యర్థి సీపీఐ పార్టీకి చెందిన సి. మహేంద్రన్ కు సుమారు 10 వేల ఓట్లు వచ్చాయి. ఆయన సహా జయలలితపై పోటీకి దిగిన 27 మంది అభ్యర్థులూ తమ డిపాజిట్లను కోల్పోయారు. పోలైన ఓట్లలో 90 శాతానికి పైగా ఓట్లు జయలలితకే పడ్డాయి. ఇది భారత అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో రికార్డని అన్నా డీఎంకే వర్గాలు తెలిపాయి. ఆమె విజయంతో చెన్నైలో కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.