: రాష్ట్రపతితో సీఎం చంద్రబాబు భేటీ
పది రోజుల వర్షాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయనను కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చోటుచేసుకున్న తాజా పరిణామాలపై ప్రణబ్ తో బాబు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్న (సోమవారం) విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు పలు కారణాల వల్ల చంద్రబాబు గైర్హాజరయ్యారు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా కలిసినట్టు చెప్పుకోవచ్చు. కాగా ఈ సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ ఇచ్చే విందుకు ఇరు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మరి ఆ విందుకు చంద్రబాబు హాజరవుతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.