: ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అగ్నిప్రమాదం
ఢిల్లీలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఈ ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. క్వార్టర్స్ లోని 12వ అంతస్తులో హఠాత్తుగా, పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్టోర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో, అగ్నిప్రమాదం సంభవించి మంటలు వ్యాపించాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం వల్ల సంభవించిన నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.