: మత్తయ్య దొరకలేదు... రేవంత్ కు బెయిల్ ఇవ్వద్దు: హైకోర్టులో ఏజీ రామకృష్ణారెడ్డి వాదన


ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిలు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై హైకోర్టులో వాదోపవాదాలు మొదలయ్యాయి. ఏసీబీ తరఫున వాదన వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించేందుకు ముందే కేసుకు సంబంధించిన మరిన్ని సాక్ష్యాధారాలతో కూడిన పత్రాలను అందించారు. ఈ కేసులో నాలుగో ముద్దాయి మత్తయ్య ఇంకా దొరకలేదని, ఆయన న్యాయస్థానాలను అడ్డుపెట్టుకుని తప్పించుకు తిరుగుతున్నారని తెలిపారు. ఆయన్ను విచారించాల్సి వుందని, సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నందున రేవంత్ కు బెయిలు ఇవ్వద్దని వాదించారు. ఈ సమయంలో బెయిలు ఇస్తే కేసు నీరుగారిపోతుందని న్యాయస్థానానికి తెలిపారు. రేవంత్ సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తని, బయటకెళ్తే కేసును బలహీనపరిచే ప్రయత్నాలు చేయవచ్చని వాదించారు. ఇది చాలా తీవ్రమైన నేరమని, ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా విచారణ జరగాల్సివుందని తెలిపారు. పట్టుబడ్డ రూ. 50 లక్షలు ఎక్కడి నుంచీ వచ్చాయో తేల్చాల్సి వుందని అన్నారు. ప్రస్తుతం ఆయన వాదన హాట్ హాట్ గా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News