: ఏపీ సీఎంతో సమావేశమైన డీజీపీ రాముడు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం డీజీపీ రాముడుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపైనే వీరిమధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది? ఎవరిపై జరిగింది? పాల్గొన్న అధికారులు ఎవరు? తదితర విషయాలపై బలమైన సాక్ష్యాలు సేకరించాలని బాబు సూచించినట్టు తెలుస్తోంది. నేడు హైకోర్టు తీర్పివ్వనున్న రేవంత్ బెయిలు వ్యవహారంపైనా బాబు వాకబు చేసినట్టు సమాచారం. కాగా, ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ప్రతిరోజూ ఉన్నతాధికారులతో చర్చిస్తూ, కేసు పురోగతిని గురించి వివరాలు తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే నేటి భేటీ జరిగిందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News