: రోడ్డు పక్కన నిలుచున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ, ఏడుగురు పోలీసులు సహా 9 మంది మృతి


పాండిచ్చేరి పరిధిలోని జగన్నాథపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన నిలబడ్డ పాపానికి 9 మంది మృతి చెందారు. వేగంగా వచ్చిన ఓ లారీ రహదారిపై బస్సు కోసం వేచి చూస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగులు పోలీసులు సహా 9 మంది అక్కడికక్కడే మరణించారు. ఘటనాస్థలి రక్తపు మరకలతో, మాంసం ముద్దలతో నిండిపోయింది. అతివేగంగా వచ్చిన లారీని డ్రైవర్ అదుపుచేయలేకపోవడమే ఘోర ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News