: కేసీఆర్ కు జ్వరం, అపాయింటుమెంట్లన్నీ రద్దు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిసింది. దీంతో ఆయన గతంలో ఇచ్చిన అపాయింటుమెంట్లను అన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటూ విశ్రాంతిలో ఉన్నారని వెల్లడించింది. కాగా, నేటి సాయంత్రం రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ ఇచ్చే విందుకు కేసీఆర్ హాజరు కావాల్సివున్న సంగతి తెలిసిందే. అపాయింటుమెంట్లన్నీ రద్దు చేయడంతో, ఆయన రాజ్ భవన్ కు వెళ్తారా? లేదా? అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది.