: 36 వేలు దాటిన జయ మెజారిటీ... గెలుపు ఖాయం!


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆర్కే నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. మొత్తం 28 మంది పోటీలో నిలబడ్డ ఈ ఎన్నికల్లో, 3వ రౌండ్ లెక్కింపు ముగిసేసరికి జయ మెజారిటీ 36 వేలకు పైగా చేరింది. ఈ ఎన్నికల్లో ఆమె గెలుపు ఖాయమని ముందునుంచే వేసిన అంచనాలు మరికాసేపట్లో అధికారికంగా నిజం కానున్నాయి. తమ అధినేత్రి గెలుపు సంబరాలను ఘనంగా జరిపేందుకు తమిళతంబీలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చెన్నైలోని ఆమె నివాసం వద్ద సందడి నెలకొంది.

  • Loading...

More Telugu News