: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కెమెరాకు చిక్కిన యూఎఫ్ఓలు... యూట్యూబ్ లో వీడియో హల్ చల్


యూఎఫ్ఓ (అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయ్యింగ్ ఆబ్జెక్ట్స్)... గ్రహాంతర వాసులు ఎక్కడో ఉన్నారని, భూమిని పరిశీలించేందుకు ఎగిరే పళ్లాల ఆకారంలోని విమానాల్లో తిరుగుతున్నారని ఎన్నో ఊహలు, అందుకు ఆధారాలుగా మరెన్నో చిత్రాలు మనం చూశాము. కానీ, ఈ వీడియో అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషనుకు (ఐఎస్ఎస్) అమర్చిన కెమెరా తీసింది. కదులుతున్న భూమి, అంతరిక్షంలో ఎగిరి వచ్చిన మూడు యూఎఫ్ఓలు కెమెరా కంటికి చిక్కాయి. నాలుగు నిమిషాల పాటున్న ఈ వీడియో సామాజిక మాధ్యమం యూట్యూబ్ లో అప్ లోడ్ కాగా, ఇప్పటికే 8 లక్షల మందికి పైగా వీక్షించారు. ఐఎస్ఎస్ లైవ్ కెమెరా ఈ దృశ్యాలను చిత్రీకరించగా, విషయం బయటకు పొక్కేసరికి నాసా ఐఎస్ఎస్ వీడియో ఫీడింగ్ ను ఆపేసింది. దీనిపై పలువురు శాస్త్రవేత్తలు నిరసన తెలిపారు. "బింగో... భూమిని దాటిపోతున్న వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోండి" అని కామెంటర్ మైఖేల్ క్లోతీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో నాసా అధికారికంగా స్పందించలేదు. ఐఎస్ఎస్ లైవ్ ఫీడ్ ఇచ్చే వీడియో స్థానంలో 'ప్లీజ్ స్టాండ్ బై' అన్న మెసేజ్ ఉంచింది.

  • Loading...

More Telugu News