: కేజ్రీవాల్ కరెంటు బిల్లు రెండు నెలలకు రూ. 91,000


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వగృహానికి ఏప్రిల్, మే నెలల్లో వచ్చిన కరెంటు బిల్లు రూ.91 వేలట. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టాన్ని వినియోగిస్తూ, ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఢిల్లీ ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం తెలియజేసింది. సివిల్ లైన్స్ లోని ఆయన నివాసంలో ఈ మేరకు కరెంటు బిల్లులు వచ్చాయని తెలిపింది. కాగా, ఆయన ఇంటికి రెండు మీటర్లు ఉన్నాయని, తాజా బిల్లు లక్ష రూపాయలను దాటిందని, మొదటి మీటరుకు రూ. 55 వేలు, రెండో మీటరుకు రూ. 48 వేల బిల్లులు వచ్చాయని బీజేపీ ప్రతినిధి ప్రవీణ్ కపూర్ వెల్లడించారు. ఈ బిల్లులు ఇంత అధికంగా ఉండటానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News